కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు కష్టాలే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సండే మార్కెట్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సంజయ్.. '
కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరి పేరున ఉన్న అప్పు రెట్టింపు అవుతుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నాయి. కర్ణాటకలో
కాంగ్రెస్ గెలిచి ఒక్క హామీ కూడా తీర్చలేదు' అన్నారు.