చెరువులో స్నానం.. మెదడు తినే అమీబాతో చిన్నారి మృతి

51చూసినవారు
చెరువులో స్నానం.. మెదడు తినే అమీబాతో చిన్నారి మృతి
కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తేదీన స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కలుషితమైన ఆ నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్‌ అమీబా ఆమె ముక్కుగుండా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, వైద్య చికిత్స ఆలస్యం కావడంతో బాలిక మరణించింది.

సంబంధిత పోస్ట్