బెంగళూరు రేవ్‌ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్‌ పాజిటివ్‌

71చూసినవారు
బెంగళూరు రేవ్‌ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్‌ పాజిటివ్‌
బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి చేసిన డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు. వారిలో తెలుగు నటి కూడా ఉన్నట్లు చెప్పారు. నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. కొందరు తెలుగు సినీ నటులు, బుల్లితెర నటులు, మోడల్స్ హాజరైనట్లు ఇప్పటికే వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్