కారులో 10 రోజులుగా యువకుడి మృతదేహం (వీడియో)

80చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రీన్ పార్క్ కూడలి సమీపంలోని పార్క్ చేసి ఉన్న కారులో యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆగి ఉన్న కారు వద్దకు పంక్చర్ చేస్తున్న యువకుడు వచ్చినప్పుడు.. దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారులో 15 రోజులుగా యువకుడి మృతదేహం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్