ఈ ఏడాది వేడిలో బెంగళూరు ఢిల్లీని మించిపోతుందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే బెంగళూరు ఉష్ణోగ్రత 2.7 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఈ ఏడాది ఫిబ్రవరి 17న బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీలు నమోదు కాగా, అదే రోజు ఢిల్లీలో 29 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.