నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతి రాణి కాలనీలో జోరుగా సాగుతున్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.56,000 నగదు, 9 ఫోన్లు, 34 బైక్‌లో, బ్యాంక్ పాస్ పుస్తకాలు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠా దాదాపు 1,000 మందిని బెట్టింగ్‌లోకి లాగినట్లు పోలీసులు గుర్తించారు.