ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కొత్త పేరు పెట్టారు. తిరుపతిలోని పద్మావతిపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటల పాటు అన్నదానం సాగే దివ్యక్షేత్రం కాశినాయన సత్రాన్ని బుల్డోజర్ తో కూటమి ప్రభుత్వం కూలగొట్టిందన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడలేదన్నారు. "సనాతన ధర్మ పరిరక్షణ నేనే కాపాడుతా" అనే ధర్మ పరిరక్షణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పవనానంద స్వామీజీ అంటూ ఈ సందర్భంగా పవన్ కు ఆయన పేరు పెట్టారు.