TG: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేసిన ఇద్దరు యూట్యూబర్లను పోలీసులు ఈ నెల 12న అరెస్టు చేశారు. పల్స్ టీవీ ఛానెల్ సీఈవో రేవతితో పాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌ను అరెస్ట్ చేశామని అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. రేవతిపై గతంలో ఎల్‌బీనగర్, బంజారాహిల్స్‌లో కేసులు ఉన్నాయని వివరించారు.