TG: కానిస్టేబుల్ పై బీర్ బాటిల్‌తో ఓ బైక్ రేసర్ దాడి చేసిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో జరిగింది. టోలీచౌకీ నుండి బైక్ పై ఖాజా అనే యువకుడు స్పీడ్‌గా వస్తూ ఓ కార్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో కార్ డ్రైవర్, ఖాజాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా.. డ్యూటీ నిమిత్తం అదే రూట్‌లో వస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఖాజా బీర్ బాటిల్‌తో శ్రీకాంత్ తలపై దాడి చేశాడు. దీంతో శ్రీకాంత్‌కు తీవ్రంగా రక్తస్రావం జరిగింది.