తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఏపీలో ఎండలు ఠారెత్తిస్తుంటే, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో ప్రకటన చేసింది. తెలంగాణలో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశ ముందని తెలిపింది. ఏపీలోని 52 మండలాల్లో మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. అక్కడక్కడ అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.