బైక్​తో విన్యాసాలు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం(వీడియో)

61చూసినవారు
బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నా హైవేలో రెప్పపాటులోనే పెను ప్రమాదం తప్పింది. ముగ్గురు యువకులు రోడ్డుపై బైక్​తో విన్యాసాలు చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఓ కారు, లారీ మధ్యలో నుంచి సదరు యువకులు స్టంట్స్ చేస్తూ బైక్​ను పోనిచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి కారును ఢీకొట్టడంతో లారీ టైర్ల కింద పడాల్సినవారు కాస్త పక్కకు పడి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్