TG: రంగారెడ్డి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. పౌల్ట్రీ సామర్థ్యం 36వేల కోళ్లు కాగా. వేలాది ఇప్పటికే మృతి చెందడంతో కోళ్లను చంపి మట్టిలో పూడ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టి.. బర్డ్‌ఫ్లూ లక్షణాలతో ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు.