మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని మండిపడ్డారు. ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటీష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారని కొనియాడారు.