ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి బ్లాక్ బస్టర్ ప్రోమో విడుదల (వీడియో)

58చూసినవారు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తొలి ఆరు రోజుల్లోనే రూ.396 కోట్లు రాబట్టి సత్తా చాటింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి బ్లాక్ బస్టర్ ప్రోమో పేరుతో మరో ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. జాన్వీకపూర్‌ హొయలుపోతూ.. అందాలు ఆరబోస్తూ తంగాన్ని ఉప్పొంగించే వీరుడు కావాలా.. అంటూ చెప్పే సంభాషణలతో ఈ ప్రోమో ప్రారంభమైంది. మీరూ చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్