AP: రాష్ట్రంలో మరో టీడీపీ కార్యకర్తపై దాడి జరిగింది. కృష్ణా జిల్లా పెడనలో దాదా అనే టీడీపీ కార్యకర్తపై దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దాదాను స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్తపై మాజీ వాలంటీర్ వెంకటరమణ కొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ మృతి చెందారు.