అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.రాయవరం మండలం చిన్న గుమ్ములూరు వద్ద ధర్మవరం రొయ్యల పరిశ్రమ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.