గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు, యువతితో కలిసి ఎయిర్ పోర్టు సమీపంలోని హోటల్‌లో దిగాడు. కొద్దిసేపటి తర్వాత భోజనం తీసుకొస్తానని బయటికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది రూమ్ డోర్స్ తెరిచి చూడగా యువతి శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతురాలు నస్రీన్ అన్సారీగా గుర్తించారు. కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.