ఆలయ ప్రాంగణంలోనే పూజారి ఆత్మహత్య

75చూసినవారు
ఆలయ ప్రాంగణంలోనే పూజారి ఆత్మహత్య
దేవాలయ ప్రాంగణంలోనే పురోహితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. కుబేర్‌నగర్‌లోని ఓ ఆలయంలో మహేంద్ర వినేకర్ పూజారిగా పనిచేస్తున్నారు. అయితే అభివృద్ధిలో భాగంగా ఈ ఆలయాన్ని కొద్దిమేర కూల్చివేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పూజారి మహేంద్ర సూసైడ్ నోట్ రాసి ఆలయ ప్రాంగణంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్