బాంబే హైకోర్టు తాజాగా మరో సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ప్రకటనల్లో ఓ మహిళ ఫొటోను ఆమె అనుమతి లేకుండా వినియోగించడాన్ని 'వాణిజ్య దోపిడీ'గా పేర్కొంటూ.. దాన్ని నిలిపివేయాలని సోమవారం బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే షటర్‌స్టాక్ అనే సంస్థతోపాటు.. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.