నెల రోజులపాటు బోనాల పండుగ: పొన్నం ప్రభాకర్

70చూసినవారు
నెల రోజులపాటు బోనాల పండుగ: పొన్నం ప్రభాకర్
ఆషాఢ మాసం బోనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సారి ఘనంగా నెల రోజులపాటు బోనాల పండుగ నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 2400కు పైగా దేవాలయాలున్నాయన్నారు. బోనాల సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులను పెంచుతున్నట్లు వెల్లడించారు. 28 ప్రముఖ ఆలయాలకు ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్