ఆ పార్టీ చేతుల్లోనే ప్రతిపక్షనేత హోదా: పవార్

84చూసినవారు
ఆ పార్టీ చేతుల్లోనే ప్రతిపక్షనేత హోదా: పవార్
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరింది. దీంతో లోక్ సభలో ప్రతిపక్షనేతగా విపక్ష'ఇండియా' బ్లాక్ ఎవరిని ఎంపిక చేస్తుందనేదానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై శరద్ పవార్ స్పందిస్తూ.. “కూటమిలో అత్యధిక సీట్లు దక్కించుకున్న పార్టీకి చెందిన నేతకు లోకసభలో ప్రతిపక్షనేత హోదా దక్కేలా ఒప్పందం కుదిరింది. 99 సీట్లతో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది. ఎవరు హోదాలో ఉంటారనేది కాంగ్రెస్సే నిర్ణయిస్తుంది” అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్