బీహార్‌లోని సరన్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కృష్ణ కుమార్ (15) అనే బాలుడికి వాంతులు అయ్యాయి. తీవ్ర అస్వస్థతతో ఉన్న కృష్ణను తల్లిదండ్రులు గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి ఆ బాలుడికి యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో మధ్యలోనే బాలుడిని మరో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో బాలుడు చనిపోయాడు. దీంతో డాక్టర్, ఇతర సిబ్బంది పారిపోయారు.