మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ జాతీయ రహదారిపై బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా పడిన ఘటన మరువక ముందే, అదే చోట మరో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. కాగా, 48 గంటల్లో ఒకే చోట రెండు ప్రమాదాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు హైవేపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.