ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. “మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం. మీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అని చెబుతాం” అని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో చంద్రబాబు.. తనకు రెండు రాష్ట్రాలు 2 కళ్లు అని వ్యాఖ్యానిచడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.