హెచ్‌సీయూ భూముల అమ్ముకానికి డోర్లు ఓపెన్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అమ్మకానికి సిద్దపడక పోతే, ఇంత రాద్దాంతం జరుగుతున్నా HCU భూముల దగ్గరకు BRS ఎందుకు వెళ్ళలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో కేంద్ర వాటా ఎంత? రాష్ట్ర వాటా ఎంత? అనేది ప్రతి రేషన్ షాప్ దగ్గర బోర్డు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు.