సంక్షోభం అంచున బీఆర్ఎస్..!

66చూసినవారు
సంక్షోభం అంచున బీఆర్ఎస్..!
భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా అలజడి రేగుతోంది. ఊహించని విధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పడిపోయింది. అయితే పార్టీ నుంచి వలసలు చాలా పెద్ద స్థాయిలో ఉంటాయన్న అభిప్రాయం కలుగుతోంది. పార్టీ ముఖ్య నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో చాలా మంది నేతలు రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్