TG: బీఆర్ఎస్ పార్టీ త్వరలో జరిగే MLC ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేస్తోందని తెలుస్తోంది. పోటీ చేద్దామని గులాబీ నేతలు ఉవ్విళ్లూరుతున్నా.. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పోటీ వద్దని వారిస్తున్నారని సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల కదన రంగం నుంచి తప్పుకోవాలని శ్రేణలను బుజ్జగిస్తున్నారని చెబుతున్నారు. మార్చిలో కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే.