TG: కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్ల తర్వాతే కాదు, ముప్పై ఏళ్ల దాకా ప్రతిపక్షంలోనే ఉంటుందని అన్నారు. మీరు చేసిన విధ్వంసానికి ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని, 15 నెలల కిందట అధికారం పోయిన విషయం గుర్తులేదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు.