దారుణం.. 13 ఏళ్ల క్యాన్సర్ బాలికపై అత్యాచారం

63చూసినవారు
దారుణం.. 13 ఏళ్ల క్యాన్సర్ బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. బీహార్‌కు చెందిన 13 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్‌పై.. ముంబైకి చెందిన 29 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్నారికి కీమోథెరపీ పరీక్షలు చేస్తుండగా.. బాలిక గర్భవతి అని తేలడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్