సుత్తితో తల పగులగొట్టి భార్యను హత్య చేసిన ఘటన యూపీలో జరిగింది. నూరుల్లా హైదర్ (55), అస్మా ఖాన్ (42) భార్యభర్తలు నోయిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్లుగా ఉద్యోగం చేస్తుండేవారు. ఇటీవల నూరుల్లా జాబ్ పోయింది. ఈ క్రమంలో నూరుల్లాకు భార్యపై అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి కూడా గొడవ జరగగా నూరుల్లా సుత్తి తీసుకొని భార్య తల పగలగొట్టి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.