చోరీలకు ఇప్పుడు దొంగలు కూడా స్మార్ట్ టెక్నిన్స్ వాడుతున్నారు. ఓ దొంగ కేవలం 15 సెకన్లలో బుల్లెట్ బైక్ ను ఎత్తుకెళ్లాడు. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే దొంగతనానికి వచ్చిన ఓ దొంగ, షాపుల ముందు పార్కింగ్ చేసిన బుల్లెట్ బైక్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత ఓ మేకు ద్వారా బైక్ హ్యాండిల్‌ను అన్‌లాక్ చేసి నిమిషం వ్యవధిలోనే బైకును చోరీ చేశాడు. చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డు కాగా వైరల్‌గా మారాయి.