మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురి మృతిచెందగా, 40మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని పంధుర్నా జిల్లా (మహారాష్ట్ర సరిహద్దు)లో మోహిత్ ఘాట్ వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సు 110కి.మీల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.