నాగ సాధువులు నగ్నంగా ఉండటానికి బలమైన కారణం ఉందట. ప్రస్తుతం ప్రజలు డబ్బు, ఆస్తి, అందం అంటూ అనేక దారుణాలకు పాల్పడుతున్నారని, అవి కొన్ని రోజులే ఉంటాయని అంటున్నారు. తర్వాత సృష్టి మొత్తం అంతం అవుతుందని, దేవుడు ఒక్కడే ఉంటాడని వారు చెబుతున్నారు. అందుకే వారు ప్రకృతికి హాని కలగకుండా నిడారంబరంగా ఉంటారట. అలాగే శరీరంపై బూడిదను పూయడంతో ప్రతికూల శక్తుల నుంచి రక్షించబడతారని వారు భావిస్తున్నారు.