హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.