హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ ఐటీ సెల్ నాయకులపై కేసు నమోదైంది. HCU అంశంలో తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు ఆరోపణలు రావడంతో, క్రిశాంక్, కొణతం దిలీప్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.