తెలంగాణలో విజృంభిస్తున్న సెల్యూలైటిస్ వ్యాధి

56చూసినవారు
తెలంగాణలో విజృంభిస్తున్న సెల్యూలైటిస్ వ్యాధి
తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలబారిన పడిన చాలా మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిపోతున్నాయి. సెల్యూలైటిస్ వ్యాధి వణుకుపుట్టిస్తోంది. రాష్ట్రంలో కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్‌ సహా వివిధ జిల్లాల్లో సెల్యూలైటిస్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కరీంనగర్‌లోనే దాదాపు 150 కేసులు బయట పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్