సాధారణంగా మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. అదే ఈ పండుగ యొక్క విశిష్టత. శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. శివుని అనుగ్రహాన్ని పొందేందుకు, శివరాత్రి రాత్రి శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తారు. శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళలో ఉందంటారు. అందుకే రాత్రి సమయంలోనే మహాశివరాత్రి జరుపుకుంటారు.