ఛోటా షకీల్ బావ ఆరిఫ్ మృతి

65చూసినవారు
ఛోటా షకీల్ బావ ఆరిఫ్ మృతి
అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బావ ఆరిఫ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆరిఫ్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆరిఫ్ మృతి చెందాడు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, ఆయన సహచరుడు ఛోటా షకీల్‌కు సహాయం చేశాడనే ఆరోపణలు ఆరిఫ్‌పై ఉన్నాయి. ఉగ్రవాద నిధుల కేసులో ఆరిఫ్‌ను NIA అరెస్టు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్