AP: ఫోరెన్సిక్ సైన్సెస్ గౌరవ సలహాదారునిగా డాక్టర్ కె.పి.సి గాంధీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం జీఓఆర్‌టి నెంబరు 702ని విడుదల చేసింది. గాంధీ రాష్ట్ర ఫోరెన్సిక్ సైంటిస్ట్, ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ డైరెక్టర్ పనిచేసి పదవీ విరమణ చేశారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఈ పదవిలో రెండేళ్లపాటు క్యాబినెట్ ర్యాంక్ హోదాలో కొనసాగనున్నారు.