నేరేడు పండ్లను జామూన్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. ఇందులో విటమిన్ A, C, K వంటి పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. పొటాషియం, కాపర్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇందులోని ఫైబర్ కారణంగా మలబద్ధకం తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధంగా ఉంటాయి. ఈ పండ్లను రెగ్యులర్‌గా తింటే బీపీ బ్యాలెన్స్ అవుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.