96 శాతం గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామసభలు: మంత్రి సీతక్క

74చూసినవారు
96 శాతం గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామసభలు: మంత్రి సీతక్క
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 4% గ్రామసభల్లోనే గొడవలు జరిగాయని, అది కూడా BRS వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారని చెప్పారు. 'మంగళవారం మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా BRS పత్రికలోనే చెప్పారు. అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్