తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.