హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డు సృష్టించాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20 ఫార్మాట్‌లో 450 మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2007లో రోహిత్ శర్మ టీ20 ల్లో ఆరంగేట్రం చేశాడు. దాదాపు 18 ఏళ్లుగా టీ20లు ఆడుతూ అనేక రికార్డులను తన వశం చేసుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (412 మ్యాచులు) ఉన్నాడు.