సింగపూర్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్‌కు చేరుకుంది. భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనుంది. అక్కడ నాలుగు రోజులపాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం బృందం పాల్గొననుంది. ప్రపంచ స్థాయి కంపెనీలు, సంస్థల ఎండీలు, అధినేతలతో భేటీలో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.