వరంగల్ ఎయిర్ పోర్ట్ పై సీఎం రేవంత్ దృష్టి

79చూసినవారు
వరంగల్ ఎయిర్ పోర్ట్ పై సీఎం రేవంత్ దృష్టి
వరంగల్‌ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిశాక ఈ అంశంపై సీఎం రేవంత్‌ అధికారులతో సమీక్షించనున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ విషయంలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ సైలెంట్‌గా ఉంది. ఇటీవల సీఎం అధికారులతో మాట్లాడుతూ.. విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై ఏఏఐ అధికారుల్లో కదలిక వచ్చింది.

సంబంధిత పోస్ట్