తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మరో ప్రకటన చేశారు. రాష్ట్రంలో అందరికీ ఉపయోగకరమైన కొత్త ఆరోగ్య పాలసీ తీసుకురావాడానికి కృషి చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. హెల్త్, బల్క్‌డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని సీఎం గుర్తుచేశారు.