కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం కీలక ప్రకటన

293376చూసినవారు
తెలంగాణలో పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అనేదానిపై సీఎం రేవంత్ స్పందించారు. రేషన్ కార్డునే పథకాలకు ఎందుకు కొలమానంగా చూస్తున్నారో తాజాగా సీఎం రేవంత్ తెలిపారు. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ కొలమానం లేకుండా పథకాలు వర్తింపజేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని అన్నారు. కొత్త రేషన్ కార్డు జారీ చేసి మళ్లీ లబ్ధిదారులను చేరుస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్