కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషం.. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో
కాంగ్రెస్, BJP ఎంపీలు చెప్పాలని BRS నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించాల్సిన
కాంగ్రెస్, BJP ఎంపీలు మౌనం దాల్చారు. తెలంగాణకు ప్రయోజనాల కోసం పోరాడేది BRSయేనని మరోసారి రుజువైంది. BJP,
కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు' అని పేర్కొన్నారు.