విగ్రహాలు తరలించడంపై కాంగ్రెస్ ఆగ్రహం

61చూసినవారు
విగ్రహాలు తరలించడంపై కాంగ్రెస్ ఆగ్రహం
పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేద్కర్‌, ఛత్రపతి శివాజీ వంటి విగ్రహాల స్థానాలను మార్చారు. దీనిపై కాంగ్రెస్.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, ఇదో విద్రోహ చర్య అని అభివర్ణించారు. అలాగే, పార్టీ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ, ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. బీజేపీకి 400 సీట్లు ఇస్తే, వారు రాజ్యాంగాన్ని కూడా విడిచిపెట్టేవారా..? అని తెలిపారు.

సంబంధిత పోస్ట్