TG: అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆ అంశంపై తమ పార్టీ అధినేత రాహుల్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలవుతోందని తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ధారించామన్నారు.